ఒలింపిక్స్‌లో క్రీడలు

కృష్ణ దివాకరన్
"శారీరక శ్రమ మానవుని ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ క్రీడలు ఆడేందుకు మరియు ప్రపంచ స్థాయిలో శ్రేష్ఠతను సాధించడానికి ఒలింపిక్స్ గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. మేము ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకొని, మిమ్మల్ని క్రీడలు ఆడేలా, మీ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించాలని అనుకుంటున్నాము. ఆరోగ్యకరమైన శరీరం మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది."
కౌంట్‌డౌన్ ప్రారంభమైంది
2028లో లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చే వేసవి ఒలింపిక్స్‌లో చరిత్రను చూసేందుకు సిద్ధంగా ఉండండి!
Day(s)
:
Hour(s)
:
Minute(s)
:
Second(s)
లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో చేర్చబడిన క్రీడలు
విలువిద్య
కళాత్మక జిమ్నాస్టిక్స్
కళాత్మక స్విమ్మింగ్
అథ్లెటిక్స్
బ్యాడ్మింటన్
బేస్బాల్ సాఫ్ట్బాల్
బాస్కెట్‌బాల్
బాస్కెట్‌బాల్ 3 X 3
బీచ్ వాలీబాల్
బాక్సింగ్
కనో స్లాలం
కనో స్ప్రింట్
క్రికెట్
సైక్లింగ్ BMX ఫ్రీస్టైల్
సైక్లింగ్ BMX రేసింగ్
సైక్లింగ్ మౌంటైన్ బైక్
సైక్లింగ్ రోడ్డు
సైక్లింగ్ ట్రాక్
డైవింగ్
గుర్రపుస్వారీ
ఫెన్సింగ్
ఫ్లాగ్ ఫుట్‌బాల్
ఫుట్బాల్
గోల్ఫ్
హ్యాండ్‌బాల్
హాకీ
జూడో
మారథాన్ స్విమ్మింగ్
మోడర్న్ పెంటాథ్లాన్
లక్రోస్
రిథమిక్ జిమ్నాస్టిక్స్
రోయింగ్
రగ్బీ సెవెన్స్
సెయిలింగ్
షూటింగ్
స్కేట్‌బోర్డింగ్
స్పోర్ట్ క్లైంబింగ్
స్క్వాష్
సర్ఫింగ్
స్విమ్మింగ్
టేబుల్ టెన్నిస్
టైక్వాండో
టెన్నిస్
ట్రామ్పోలిన్
ట్రయాథ్లాన్
వాలీబాల్
వాటర్ పోలో
వెయిట్ లిఫ్టింగ్
రెజ్లింగ్

గుర్రపుస్వారీ
6 పతకాలు
ఆటలు
- ఈవెంటింగ్ టీమ్ & ఈవెంటింగ్ ఇండివిడ్యువల్
- డ్రెస్సేజ్ టీమ్ & డ్రస్సేజ్ ఇండివిడ్యువల్
- జంపింగ్ టీమ్ & జంపింగ్ ఇండివిడ్యువల్
ఈ ఈవెంట్ గుర్రం మరియు రౌతుని డ్రస్సేజ్, షో జంపింగ్ మరియు క్రాస్ కంట్రీ మీద పరీక్ష చేసే మూడు రోజుల పోటీ. డ్రస్సేజ్ అనేక గ్రాండ్ ప్రిక్స్ ట్రయల్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో జంటలు ముందుగా నిర్ణయించిన వేగం, పరివర్తనలు మరియు కదలికలను గుర్తు పెట్టుకొని చేసే రొటీన్‌లకు మార్కులు ఇవ్వబడతాయి. షోజంపింగ్ లో గుర్రం మరియు రౌతు నిర్దేశించిన అడ్డంకులను క్లియర్ చేస్తారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

విలువిద్య
5 పతకాలు
ఆటలు
- పురుషుల వ్యక్తిగత పోటీ
- మహిళల వ్యక్తిగత పోటీ
- పురుషుల జట్టు పోటీ
మహిళల జట్టు పోటీ
- మిశ్రమ జట్టు పోటీ
విలువిద్య ఒలింపిక్స్‌తో ప్రారంభ దశల నుంచే సంబంధం కలిగి ఉన్న క్రీడ. ఇది 1900లో జరిగిన రెండవ ఒలింపిక్ క్రీడల్లో తొలిసారిగా చేర్చబడింది. ఒలింపిక్ క్రీడల్లో “రికర్వ్ బో” అనబడే విల్లు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ పోటీల్లో ఉపయోగించే విల్లు పేరు “టేక్‌డౌన్ రికర్వ్”.అంటే వీటిలో రైజర్ (మధ్య భాగం) నుండి లింబ్‌లను (పక్క భాగాలను) విడదీయవచ్చు.విలువిద్య నియమాల ప్రకారం, మ్యాచ్ ప్లేలో మొత్తం ఆరు పాయింట్లు సాధించిన తొలి ఆర్చర్ లేదా జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఒలింపిక్స్‌లో విలువిద్యకు వ్యక్తిగత మరియు జట్టు విభాగాలు రెండూ ఉంటాయి.ప్రతి వ్యక్తిగత విభాగంలో మొత్తం 64 మంది పోటీదారులు పాల్గొంటారు. ఈ స్థానాలలో మూడు స్థానాలు ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ద్వారా అర్హత పొందుతాయి.
లండన్ 2012 గేమ్స్ తర్వాత తొలిసారిగా, భారత్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఆరుగురు ఆర్చర్లతో కూడిన పూర్తిస్థాయి జట్టును రంగంలోకి దించింది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

జూడో
15 పతకాలు
ఆటలు
- స్త్రీలు - 48 kg, 52 kg, 57 kg, 63 kg 70 kg, 78 kg, +78 kg
- పురుషులు - 60 kg, 66 kg, 73 kg, 81 kg, 90 kg, 100 kg, +100 kg
- మిశ్రమ జట్టు
జూడో అనేది జియు-జిట్సు నుండి ఉద్భవించిన సాంప్రదాయ జపనీస్ యుద్ధ కళ. జూడో యొక్క లక్ష్యం ప్రత్యర్థిని విసిరివేయడం, పిన్ అనే టెక్నిక్‌తో ప్రత్యర్థిని కదలకుండా అదిమి ఉంచడం లేదా జాయింట్ లాక్ / ఆర్మ్ చౌక్ అనే టెక్నిక్‌తో లొంగిపోయేలా చేయడం. జూడో లో బరువుని బట్టి కేటగిరీలుగా విభజిస్తారు. ఈ కేటగిరీలు పురుషులు, మహిళలు & మిశ్రమ జట్లకు భిన్నంగా ఉంటాయి. ప్రతి కేటగిరీలో ప్రతి దేశం నుండి గరిష్టంగా ఒకరిని మాత్రమే అనుమతించవచ్చు. మిశ్రమ ఈవెంట్‌లో, ఒక దేశం మరొక దేశంతో పోటీపడుతుంది, ఇందులో వివిధ బరువు కేటగిరీల నుండి ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు మహిళా అథ్లెట్ల జట్లు పోటీపడుతాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

లాక్రోస్
2 పతకాలు
ఆటలు
- స్త్రీల - 6 x 6
- పురుషుల - 6 x 6
లాక్రోస్ అనేది ఒక జట్టుగా ఆడే క్రీడ, ఇక్కడ ఆటగాళ్ళు ఒక వలతో కూడిన కర్ర సహాయంతో ఒక గట్టి రబ్బరు బంతిని ప్రత్యర్థి జట్టు గోల్‌లోకి కొట్టడానికి ప్రయత్నిస్తారు. “వరల్డ్ లాక్రోస్ సిక్సెస్” అనే క్రీడ 70x36 చదరపు మీటర్ల పిచ్‌పై ఆడతారు. ఈ పిచ్ కి ఇరువైపుల చివరి-లైన్ల నుండి 10మీ దూరంలో గోల్‌లను కలిగి ఉంటుంది. ఇది కర్రలతో ఆడే క్రీడ కాబట్టి రక్షణ పరికరాలు తప్పనిసరి. ఈ శతాబ్దంలోనే మొదటిసారిగా, లాస్ ఏంజిల్స్ లో 2028 లో జరగబోయె ఒలింపిక్ గేమ్స్ లో, లాక్రోస్ కాంపాక్ట్ సిక్స్ ఫార్మాట్ లో పోటీ చెయ్యబోతున్నది. లాక్రోస్ కాంపాక్ట్ సిక్స్ ఫార్మాట్ బాగా కుదించిన అత్యంత వేగవంతమైన క్రీడ. ఈ క్రీడ ఫీల్డ్ లాక్రోస్ మరియు బాక్స్ లాక్రోస్ మధ్య వెర్షన్. ఇది లాక్రోస్ అథ్లెట్లందరికీ సమానమైన అవకాశాన్ని అందిస్తుంది మరియు కొత్త ఆటగాళ్లకు సులభమైన ప్రవేశాన్ని అందిస్తుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

డైవింగ్
8 పతకాలు
ఆటలు
- మహిళలు & పురుషుల 3మీ స్ప్రింగ్‌బోర్డ్
- మహిళలు & పురుషుల 10మీ ప్లాట్‌ఫారమ్
- మహిళలు & పురుషుల సింక్రొనైజ్డ్ 3మీ స్ప్రింగ్‌బోర్డ్
- మహిళలు & పురుషుల సమకాలీకరించబడిన 10మీ ప్లాట్‌ఫారమ్
డైవింగ్ క్రీడలో అథ్లెట్లు ఒక్కొక్కరు లేదా కలిసి, స్ప్రింగ్‌బోర్డ్ లేదా ప్లాట్‌ఫారమ్ నుండి జంప్ చేసి గాలిలో విన్యాసాలు చేస్తు పూల్ లోకి నిలువుగా ప్రవేశిస్తారు. నీటిలోకి ప్రవేశించే సమయంలో స్ప్లాష్ తక్కువగా ఉండే విధంగా చూస్కుంటారు. పురుషులు మరియు మహిళలు ఒకే విభాగాలలో పోటీపడతారు, పురుషులు ఆరు డైవ్‌లు పూర్తి చేస్తారు, మహిళలు ఐదు పూర్తి చేస్తారు.
స్కోర్లు ఈ అంశాల పైన అంచనా వేయబడతాయి: ప్రారంభ స్థానం, చేరిక, ఎత్తు, ఫ్లైట్, నీటిలోకి ప్రవేశించే విధానం, మరియు భాగస్వామితో సమకాలీకరణ.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

కళాత్మక జిమ్నాస్టిక్స్
14 పతకాలు
ఆటలు
- పురుషుల పార్లల్ బార్స్
- పురుషుల హారిజాంటల్ బార్
- మహిళల టీం
- మహిళల ఆల్-అరౌండ్
- మహిళల వాల్ట్
- మహిళల అనీవెన్ బార్స్
- మహిళల బాలన్స్ బీమ్
- మహిళల ఫ్లోర్ ఎక్సర్‌సైజ్
- పురుషుల జట్టు
- పురుషుల ఆల్-అరౌండ్
- పురుషుల ఎక్సర్‌సైజ్
- పురుషుల పోమ్మెల్ హార్స్
- పురుషుల రింగ్స్
- పురుషుల వాల్ట్
ప్రపంచవ్యాప్తంగా కళాత్మక జిమ్నాస్టిక్స్ ప్రేక్షకులను ఆకర్షించే అంతర్జాతీయ క్రీడ. కళాత్మక జిమ్నాస్టిక్స్ అనేది రిథమిక్ జిమ్నాస్టిక్స్ మరియు ట్రాంపోలిన్‌లకు భిన్నమైన ఒక ప్రత్యేక ఒలింపిక్ క్రీడ. ఇందులో ఫ్లోర్ వ్యాయామం, పామెల్ హార్స్, రింగ్స్, వాల్ట్, ప్యారలల్ బార్‌లు, క్షితిజ సమాంతర బార్‌లు వంటి పురుషుల ఈవెంట్‌లు మరియు ఫ్లోర్ వ్యాయామం, వాల్ట్, అసమాన బార్‌లు, బ్యాలెన్స్ బీమ్ వంటి మహిళల ఈవెంట్‌లు ఉంటాయి. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ వ్యక్తిగత ఈవెంట్‌లు, కంబైన్డ్ ఎక్సర్‌సైజ్‌లు (ఆల్‌రౌండ్) మరియు టీమ్ కంబైన్డ్ ఎక్సర్‌సైజ్‌లలో పతకాల కోసం పోటీపడతారు.అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశానికి చెందిన దీపా కర్మాకర్ ఒలింపిక్ చరిత్రలో మన దేశం నుండి కళాత్మక జిమ్నాస్టిక్స్‌కు అర్హత సాధించిన మొదటి మహిళ. కర్మాకర్ ప్రొడునోవా వాల్ట్‌ను పూర్తి చేసింది, ఇది అతి కష్టతరమైన వాల్ట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

కళాత్మక స్విమ్మింగ్
2 పతకాలు
ఆటలు
- జంటలు
- జట్టు
కళాత్మక స్విమ్మింగ్ కోసం పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల కార్యక్రమంలో రెండు (2) ఈవెంట్‌లు చేర్చబడ్డాయి: జంటలు మరియు జట్లు. కళాత్మక స్విమ్మింగ్ క్రీడ నీటి విన్యాసాలను సంగీతంతో కలపడం ద్వారా మెరుగుపరిచారు. ఈ క్రీడ రెండు ఈవెంట్లను కలిగి ఉంటుంది: ఒక జంట మరియు జట్టు పోటీ. జంట ఈవెంట్‌లు టెక్నికల్ రొటీన్ మరియు ఫ్రీ రొటీన్‌లను కలిగి ఉంటాయి.
జట్టు ఈవెంట్‌లో అక్రోబాటిక్ రొటీన్‌ను కూడా చేర్చారు. ఈ ఈవెంట్‌లు 30 మీటర్ల నుండి 20 మీటర్ల విస్తీర్ణంలో మరియు కనీసం 3 మీటర్ల లోతు ఉన్న కొలనులో జరుగుతాయి..
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

షూటింగ్
15 పతకాలు
ఆటలు
- పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్
- పురుషుల 50 మీ రైఫిల్ 3 స్థానాలు
- పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్
- పురుషుల 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
- పురుషుల ట్రాప్
- పురుషుల స్కీట్
- మహిళల 10మీ ఎయిర్ రైఫిల్
- మహిళల 50 మీ రైఫిల్ 3 స్థానాలు
- మహిళల 10మీ ఎయిర్ పిస్టల్
- మహిళల 25మీ పిస్టల్
- మహిళల ట్రాప్
- మహిళల స్కీట్
- మిశ్రమ టీమ్ 10మీ ఎయిర్ రైఫిల్
- మిశ్రమ టీమ్ 10మీ ఎయిర్ పిస్టల్
- మిశ్రమ టీమ్ స్కీట్
1896లో ఏథెన్స్‌లో జరిగిన మొదటి ఆధునిక క్రీడల నుండి ఒలింపిక్ క్రీడలలో షూటింగ్ ఉనికిని కలిగి ఉంది, అప్పుడు ఐదు ఈవెంట్‌లు జరిగాయి. పారిస్‌లో, షూటింగ్ కార్యక్రమంలో 15 ఈవెంట్‌లు ఉంటాయి. పారిస్ 2024లో షూటింగ్ విభాగంలో 170 మంది పురుషులు మరియు 170 మంది మహిళలు పోటీపడ్డారు. ఒలింపిక్ క్రీడలలో మొత్తం 340 మంది షూటర్లు 15 పతక ఈవెంట్‌లలో పోటీపడతారు. ఈ ఈవెంట్‌లు మూడు విభాగాలుగా విభజించబడ్డాయి: రైఫిల్, పిస్టల్ మరియు షాట్‌గన్. ప్రతి విభాగంలో ఐదు పతకాలు అందించబడతాయి: ప్రతి విభాగంలో ఐదు పతక ఈవెంట్‌లు ఉంటాయి: పురుషులకు రెండు, మహిళలకు రెండు మరియు మిశ్రమ టీమ్ ఈవెంట్‌కి ఒకటి. పిస్టల్ మరియు రైఫిల్ ఈవెంట్‌లు రెండూ ఇండోర్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతాయి, అయితే షాట్‌గన్ ఈవెంట్‌లు ( ట్రాప్ మరియు స్కీట్ ) అవుట్‌డోర్‌లో జరుగుతాయి. అథ్లెట్లు కదులుతున్న మట్టి లక్ష్యాలపై కాల్పులు జరుపుతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

స్కేట్‌బోర్డింగ్
4 పతకాలు
ఆటలు
- మహిళల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్
- పురుషుల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్
- మహిళల పార్క్స్కేట్‌బోర్డింగ్
- పురుషుల పార్క్స్కేట్‌బోర్డింగ్
పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో స్కేట్‌బోర్డింగ్‌లో క్రీడాకారులు రైల్స్, స్తైర్స్ అండ్ గ్యాప్స్ నుండి హిప్స్, లిప్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కి మూవ్ అవుతారు. ప్రపంచంలోని అత్యుత్తమ రైడర్‌లు రెండు విభాగాలలో పోటీపడతారు: స్ట్రీట్ మరియు పార్క్. స్కేట్‌బోర్డింగ్ ఒకే క్రీడ అయినప్పటికీ, పార్క్ మరియు స్ట్రీట్ కోర్సులు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పార్క్ పోటీలు ర్యాంప్‌లు, క్వార్టర్ పైపులు మరియు బంప్‌లతో కూడిన ఒక కాంక్రీట్ బౌల్ మీద జరుగుతాయి.స్ట్రీట్ స్కేటర్లు పట్టణ వాతావరణాన్ని ప్లేగ్రౌండ్‌లా మార్చి, రాంప్‌లు మరియు రైల్స్‌పై తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. రెండు విభాగాలు చాలా విభిన్నంగా ఉన్నందున, కొంతమంది స్కేటర్లు మాత్రమే స్ట్రీట్ & పార్క్ రెండింటిలోనూ ఉన్నత స్థాయిలో పోటీ పడతారు
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

స్పోర్ట్ క్లైంబింగ్
4 పతకాలు
ఆటలు
- మహిళల బౌల్డర్ & లీడ్
- మహిళల స్పీడ్
- పురుషుల బౌల్డర్ & లీడ్
- పురుషుల స్పీడ్
స్పోర్ట్ క్లైంబింగ్ టోక్యో 2020 ఒలింపిక్స్ లో అరంగేట్రం చేసింది. ఆ ఒలింపిక్స్ లో మూడు విభాగాలు (స్పీడ్, బౌల్డర్ మరియు లీడ్) కలిపి ఒకే ఈవెంట్‌లో చేర్చబడ్డాయి. పారిస్ 2024 లో, స్పీడ్ ఒక స్వతంత్ర ఈవెంట్‌గా జరిగింది, అయితే బౌల్డర్ మరియు లీడ్ కలిపి ఒకే ఈవెంట్‌లో ప్రదర్శించబడ్డాయి. బలం, వశ్యత, ముందస్తు ప్రణాళిక మరియు నిర్ణయాత్మకత విజయానికి కీలకం. స్పీడ్ క్లైంబింగ్‌లో, పోటీదారులు 15 మీటర్ల ఎత్తైన గోడపై 95-డిగ్రీల కోణంలో స్థిరమైన మార్గాన్ని వీలైనంత వేగంగా స్కేల్ చేస్తారు. ప్రారంభించే ముందు, అధిరోహకుల భద్రత కోసం వారికి తాడులు మరియు హార్నెస్ ని కడతారు. బౌల్డరింగ్‌లో, పోటీదారులు ప్రతీ బౌల్డర్ వద్ద నాలుగు-నిమిషాల సమయ పరిమితిలో నాలుగు మీటర్ల గోడపై అనేక స్థిరమైన మార్గాలను స్కేల్ చేస్తారు. లీడ్ క్లైంబింగ్‌లో, పోటీదారులు ఆరు నిమిషాల సమయ పరిమితిలో కనీసం 15 మీటర్ల ఎత్తు మరియు మూడు మీటర్ల వెడల్పు ఉన్న గోడపై వీలైనంత ఎత్తుకు స్కేల్ చేస్తారు. పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ 68 మంది పురుషులు మరియు మహిళా అథ్లెట్లు క్రీడా క్లైంబింగ్ లో పోటీ పడ్డారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

స్క్వాష్
ఆటలు
LA 2028 ఒలింపిక్స్‌లో చేర్చవలసి వుంది
స్క్వాష్ అనేది నాలుగు గోడలతో చుట్టబడిన దీర్ఘచతురస్రాకార కోర్టులో ఇద్దరు వ్యక్తులు సాధారణంగా ఆడుకునే రాకెట్ క్రీడ. స్క్వాష్ పోటీ లో ఆటగాళ్లు ఒకరి తర్వాత మరొకరు కోర్టు ముందు గోడకు వ్యతిరేకంగా రబ్బరు బంతిని కొట్టడం ద్వారా ఆడతారు. స్క్వాష్ కోర్టులో నేల గట్టి చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. ప్రొఫెషనల్ పోటీలో, ప్రేక్షకులు ఆటని చూసేందుకు వీలుగా మరియు వారి భద్రత కోసం గోడలను గాజు గ్లాస్ తో నిర్మిస్తారు. స్క్వాష్ గేమ్ సాధారణంగా 11 పాయింట్ల వరకు ఆడబడుతుంది. విజేత కనీసం రెండు పాయింట్ల తేడాతో గెలవాలి. ఒక మ్యాచ్ సాధారణంగా అత్యుత్తమ మూడు లేదా అత్యుత్తమ ఐదు సిరీస్ గా జరుగుతుంది. స్క్వాష్ గతంలో ఎన్నడూ ఒలింపిక్ క్రీడలలో కనిపించలేదు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సర్ఫింగ్
2 పతకాలు
ఆటలు
- పురుషులు
- మహిళలు
తాహితీలో ఒలింపిక్ సర్ఫింగ్ స్థానిక అభిమానులు మరియు అంతర్జాతీయ ప్రేక్షకులు ఆనందించే అద్భుతమైన అనుభవం. పారిస్ 2024లో సర్ఫింగ్ పోటీ మొదటి రౌండ్‌లో ఎనిమిది హీట్‌లతో ప్రారంభమైంది, ప్రతి హీట్‌లో ముగ్గురు అథ్లెట్లు పాల్గొన్నారు. సర్ఫింగ్ ఐదుగురు న్యాయమూర్తుల అంతర్జాతీయ ప్యానెల్ ద్వారా, ప్రతి అల ఆధారంగా (wave-by-wave) స్కోర్ చేయబడుతుంది. ఈ న్యాయమూర్తులను ఒక ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షిస్తారు. ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో దూకుడైన మలుపులు లేదా విన్యాసాలు ఎక్కువ రివార్డు పొందుతాయి. ఫ్రెంచ్ పోలినేశియాలోని ప్రసిద్ధ సర్ఫింగ్ ప్రాంతం టీహూపో ఇక్కడ, సర్ఫర్స్ దృష్టి పూర్తిగా ‘బారెల్’ లేదా ‘ట్యూబ్’ (అంటే, ఒక సర్ఫర్ అదృశ్యమయ్యే అల యొక్క గుహాకార భాగం) పైనే ఉంటుంది. “ది ఇంపాజిబుల్ వేవ్” అనేది ఒక అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ. ఇది ఒలింపిక్ క్రీడల్లో సర్ఫింగ్‌ను చేర్చడానికి ISA మరియు దాని అధ్యక్షుడు ఫెర్నాండో అగ్యురే 27 సంవత్సరాల పాటు చేసిన విశేషమైన ప్రయత్నాల కథను చెబుతుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

స్విమ్మింగ్
35 పతకాలు
ఆటలు
- పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్
- పురుషుల 200మీ బ్యాక్‌స్ట్రోక్
- పురుషుల 100మీ బ్రెస్ట్‌స్ట్రోక్
- పురుషుల 200మీ బ్రెస్ట్‌స్ట్రోక్
- పురుషుల 100మీ బటర్‌ఫ్లై
- పురుషుల 200మీ బటర్‌ఫ్లై
- పురుషుల 200మీ ఇండివిడ్యువల్ మెడ్లీ
- పురుషుల 400మీ ఇండివిడ్యువల్ మెడ్లీ
- పురుషుల 4 x 100మీ ఫ్రీ స్టైల్ రిలే
- పురుషుల 4 x 200మీ ఫ్రీ స్టైల్ రిలే
- పురుషుల 4 x 100మీ మెడ్లీ రిలే
- మిక్స్‌డ్ 4 x 100మీ మెడ్లీ రిలే
- మహిళల 200మీ బటర్‌ఫ్లై
- మహిళల 200మీ ఇండివిడ్యువల్ మెడ్లీ
- మహిళల 400మీ ఇండివిడ్యువల్ మెడ్లీ
- మహిళల 4 x 100మీ ఫ్రీ స్టైల్ రిలే
- మహిళల 4 x 200మీ ఫ్రీ స్టైల్ రిలే
- మహిళల 4 x 100మీ మెడ్లీ రిలే
- పురుషుల 50మీ ఫ్రీ స్టైల్
- పురుషుల 100మీ ఫ్రీ స్టైల్
- పురుషుల 200మీ ఫ్రీ స్టైల్
- పురుషుల 400మీ ఫ్రీ స్టైల్
- పురుషుల 800మీ ఫ్రీ స్టైల్
- పురుషుల 1500మీ ఫ్రీ స్టైల్
- మహిళల 50మీ ఫ్రీ స్టైల్
- మహిళల 100మీ ఫ్రీ స్టైల్
- మహిళల 200మీ ఫ్రీ స్టైల్
- మహిళల 400మీ ఫ్రీ స్టైల్
- మహిళల 800మీ ఫ్రీ స్టైల్
- మహిళల 1500మీ ఫ్రీ స్టైల్
- మహిళల 100మీ బ్యాక్‌స్ట్రోక్
- మహిళల 200మీ బ్యాక్‌స్ట్రోక్
- మహిళల 100మీ బ్రెస్ట్‌స్ట్రోక్
- మహిళల 200మీ బ్రెస్ట్‌స్ట్రోక్
- మహిళల 100మీ బటర్‌ఫ్లై
పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల కార్యక్రమంలో స్విమ్మింగ్ కోసం మొత్తం ముప్పై ఐదు (35) ఈవెంట్‌లు చేర్చబడ్డాయి. వ్యక్తిగత ఈవెంట్‌లో నామినేట్ కావాలంటే, స్విమ్మర్లు ఆ ఈవెంట్‌లో ఒలింపిక్ క్వాలిఫైయింగ్ సమయాన్ని సాధించడంతో పాటు ట్రయల్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలి. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో వ్యక్తిగత ఈవెంట్‌లు, జట్టు రిలే ఈవెంట్‌లు (పురుషులు మరియు మహిళలకు విడిగా), అలాగే మిశ్రమ జట్లకు 4x100మీ మెడ్లే రిలే ఈవెంట్‌లు ఉంటాయి. మొత్తం 35 ఈవెంట్‌లు ఉంటాయి — 17 మహిళలకు, 17 పురుషులకు మరియు ఒక మిశ్రమ ఈవెంట్. ప్రతి ఈవెంట్‌కి తన స్వంత బంగారు, వెండి మరియు కాంస్య పతకాల సమాహారం ఉంటుంది.
ఏ స్విమ్మింగ్ ఈవెంట్‌లోనైనా ర్యాంకింగ్ ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టబద్ధంగా కోర్సును తక్కువ సమయంలో పూర్తి చేసిన ఈతగాడు విజేత అవుతాడు; మిగిలిన వారు వారి సమయాల ఆధారంగా వేగంగా నుండి నెమ్మదిగా వరకు ర్యాంక్ చేయబడతారు. ఒలింపిక్ ప్రమాణాల ప్రకారం ఈత కొలనులు 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, మరియు 10 లేన్‌లతో నిర్మించబడతాయి
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

టేబుల్ టెన్నిస్
5 పతకాలు
ఆటలు
- పురుషుల సింగిల్స్
- మహిళల సింగిల్స్
- మిక్స్‌డ్ డబుల్స్
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
టేబుల్ టెన్నిస్‌ను ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్లకు పైగా ప్రజలు ఆడుతున్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి. టేబుల్ టెన్నిస్‌ను ఒక నెట్‌తో రెండుగా విభజించిన టేబుల్‌పై ఆడుతారు. చాలా తేలికైన బంతి మరియు అధునాతన రాకెట్లు — లేదా రెండు వైపులా రబ్బరు ఉపరితలంతో పూసిన చెక్క బ్లేడ్‌లతో తయారైన ‘ప్యాడిల్’లను ఉపయోగిస్తారు.సింగిల్స్ మ్యాచ్‌లలో, ఏడు గేమ్‌లలో ఎవరు ఎక్కువ గెలుస్తారో వారే విజేతగా నిలుస్తారు. ప్రతి గేమ్‌లో 11 పాయింట్లు (కనీసం రెండు పాయింట్ల తేడాతో) సాధించిన ఆటగాడు ఆ గేమ్‌ను గెలుస్తాడు.టీమ్ మ్యాచ్‌లలో నాలుగు సింగిల్స్ మరియు ఒక డబుల్స్ మ్యాచ్ ఉంటాయి. ప్రతి మ్యాచ్‌లో ఐదు గేమ్‌లు ఆడబడతాయి. ఏ ఆటగాడు ఎక్కువ గేమ్‌లు గెలిస్తే, అతను ఆ మ్యాచ్‌ను గెలిచినట్లు భావిస్తారు. ప్రతి జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఉంటారు, మరియు ఒక జట్టు మూడు వ్యక్తిగత గేమ్‌లను గెలిచినప్పుడు ఆ మ్యాచ్ ముగుస్తుంది. డబుల్స్ మ్యాచ్‌లలో, ఆటగాళ్లు బంతిని కొట్టడానికి ప్రత్యామ్నాయంగా (తరచూ మారుతూ) షాట్లు తీసుకుంటారు. టేబుల్ టెన్నిస్ టేబుల్ నేల నుండి 76 సెం.మీ ఎత్తులో ఉంటుంది, దాదాపు మూడు మీటర్ల పొడవు మరియు ఒకన్నర మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బంతి తప్పనిసరిగా 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న నెట్‌పై నుంచి వెళ్లాలి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

టైక్వాండో
8 పతకాలు
ఆటలు
- పురుషులు -58kg
- పురుషులు -68kg
- పురుషులు -80kg
- పురుషులు +80kg
- స్త్రీలు -49kg
- స్త్రీలు -57kg
- స్త్రీలు -67kg
- స్త్రీలు +67kg
టైక్వాండో అనగా కిక్కింగ్ మరియు పంచింగ్ ఆర్ట్. ఇది ఒక మార్షల్ ఆర్ట్. టైక్వాండో యొక్క లక్ష్యం ఒక అథ్లెట్ తమ ప్రత్యర్థిని కిక్స్ మరియు పంచ్‌లతో దాడి చేయడం, అదే సమయంలో తమను తాము కాపాడుకోవడం. ఈ యుద్ధ కళ యొక్క ట్రేడ్‌మార్క్ కిక్స్ మరియు పంచ్‌ల కదలికల కలయిక. ఈ పోటీల్లో 64 మంది మహిళలు, 64 మంది పురుషులు పాల్గొంటారు. కొరియా టైక్వాండో యొక్క జన్మస్థలం కాగా, ఈ క్రీడలో కొరియన్లు ఇప్పటికీ ఆధిపత్యం చాటుతున్నారు. బౌట్‌లు "బెస్ట్-ఆఫ్-త్రీ" ఫార్మాట్‌లో జరుగుతాయి. ప్రతి రెండు నిమిషాల రౌండ్ ప్రారంభంలో స్కోర్‌లు రీసెట్ చేయబడుతాయి. అథ్లెట్ ర్యాంకింగ్‌ను నిర్ణయించడానికి వివిధ బెల్ట్‌లు ఉంటాయి. బెల్ట్‌లు 10 గ్రేడ్‌ల ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రారంభకులు వైట్ బెల్ట్‌తో మొదలు పెడతారు; తరువాత పసుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు మరియు అత్యధిక స్థాయి బ్లాక్ బెల్ట్ అవుతుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

టెన్నిస్
5 పతకాలు
ఆటలు
- పురుషుల సింగిల్స్
- మహిళల సింగిల్స్
- పురుషుల డబుల్స్
- మహిళల డబుల్స్
- మిక్స్‌డ్ డబుల్స్
పారిస్ 2024లో జరిగే ఒలింపిక్ టెన్నిస్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అర్హత పొందాలంటే, అథ్లెట్లందరూ తమ జాతీయ సంఘం మరియు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యతో మంచి స్థితిలో ఉండాలి. ఒలింపిక్ షెడ్యూల్ ప్యాక్డ్ గా ఉంటుంది. ఇక్కడ టెన్నిస్ కి ఐదు బంగారు పతకాలు ఉంటాయి. టెన్నిస్ ఈవెంట్‌లో 41 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి, ఐదు ఈవెంట్‌లలో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్) 184 మంది క్రీడాకారులు పోటీ పడతారు. టెన్నిస్ యొక్క ప్రాథమిక లక్ష్యం బంతిని రాకెట్‌తో నెట్ మీదుగా మరియు ప్రత్యర్థి ప్రాంతంలోకి కొట్టడం. ప్రత్యర్థి బంతిని తిరిగి ఇవ్వలేనప్పుడు లేదా తిరిగి వచ్చిన తర్వాత దానిని హద్దులు దాటి కొట్టినప్పుడు ఒక పాయింట్ గెలుస్తారు
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

ట్రామ్పోలిన్
2 పతకాలు
ఆటలు
- పురుషులు
- మహిళలు
ట్రామ్పోలిన్ అనేది ఒలింపిక్స్‌లో ఒక వ్యక్తిగత క్రీడ, ఇందులో పురుషుల మరియు మహిళల పోటీలలో 16 మంది క్రీడాకారులు పోటీ పడుతారు. జిమ్నాస్ట్‌లు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో రెండు రొటీన్‌లు చేస్తారు, ప్రతి ఒక్కటి 10 నైపుణ్యాలను కలిగి ఉంటుంది - ఫ్లిప్‌లు, ట్విస్ట్‌లు మరియు లీప్స్.అథ్లెట్లు తమ స్వచ్ఛంద (వాలంటరీ) రొటీన్‌ను రెండుసార్లు చేస్తారు. ఈ స్వచ్ఛంద రొటీన్‌ను ప్రతి అథ్లెట్ తన ఇష్టానుసారం చేయవచ్చు.
ఈ రొటీన్‌లో మొత్తం 10 నైపుణ్యాలు ఉంటాయి. ప్రతి నైపుణ్యానికి కష్టతర స్థాయికి (డిఫికల్టీ స్కోర్) అనుగుణంగా మార్కులు ఇవ్వబడతాయి. దానితోపాటు నాలుగు అంశాల స్కోర్లు — కష్టం (Difficulty), అమలు (Execution), క్షితిజ సమాంతర స్థానభ్రంశం (Horizontal Displacement), మరియు ఫ్లైట్ సమయం (Time of Flight) — కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నాలుగు అంశాల స్కోర్లు, నైపుణ్య స్కోర్లతో కలిపి, ఆ రొటీన్‌కు తుది స్కోర్ నిర్ణయించబడుతుంది.ట్రామ్పోలిన్ ఒలింపిక్ క్రీడగా మారినప్పటి నుండి, ఈ విభాగంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. చైనా ఇప్పటివరకు 36 పతకాలలో 14ను గెలుచుకుంది, వాటిలో 12 ఒలింపిక్ టైటిల్స్‌లో నాలుగు బంగారు పతకాలు ఉన్నాయి
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

ట్రయాథ్లాన్
3 పతకాలు
ఆటలు
- మహిళల వ్యక్తిగత పోటీ
- పురుషుల వ్యక్తిగత పోటీ
- మిశ్రమ రిలే పోటీ
ట్రయాథ్లాన్ అనేది మూడు విభాగాలతో కూడిన ఒక రేసు — 1.5 కి.మీ ఈత, 40 కి.మీ సైకిల్ రైడ్ మరియు 10 కి.మీ పరుగు. ఈ క్రీడలో అథ్లెట్ యొక్క సహనశక్తి మరియు సత్తువను క్షుణ్ణంగా పరీక్షిస్తారు, ఎందుకంటే ప్రతి విభాగం మధ్య ఎటువంటి విరామం ఉండదు. ట్రయాథ్లాన్‌లో, రన్నింగ్, స్విమ్మింగ్ మరియు సైక్లింగ్ ఈవెంట్‌ల మాదిరిగా హీట్స్ (ప్రారంభ రౌండ్‌లు లేదా అర్హత సాధించే రేసులు) ఉండవు.
పురుషులు మరియు మహిళల విభాగాలకు ఒక్కొక్కటిగా ఒకే ఫైనల్ ఉంటుంది.
మొత్తం 110 మంది అథ్లెట్లు (55 మంది పురుషులు మరియు 55 మంది మహిళలు) ఈ మూడు ఈవెంట్లలో పోటీపడతారు. మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో నలుగురు అథ్లెట్లు — ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు — ఈ క్రమంలో పోటీ పడతారు: స్త్రీ–పురుషుడు–స్త్రీ–పురుషుడు.
ప్రతి అథ్లెట్ తమ భాగంలో 300 మీటర్ల ఈత, 6.8 కి.మీ సైకిల్ రైడ్ మరియు 2 కి.మీ పరుగు పూర్తి చేసి,
తదుపరి సహచరుడిని ట్యాగ్ (తాకి లేదా, తదుపరి ఆటగాడిని ప్రారంభించమని సంకేతం ఇవ్వడం) చేసిన తర్వాత ఆయన/ఆమె రేసులో తమ భాగాన్ని ప్రారంభిస్తారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

వాలీబాల్
2 పతకాలు
ఆటలు
- పురుషులు
- మహిళలు
వాలీబాల్‌ను 18మీ పొడవు మరియు 9మీ వెడల్పు గల ఇండోర్ కోర్ట్‌లో ఆరుగురు ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు ఆడతారు. ప్రతీ మ్యాచ్ లో గెలుపు అనేది బెస్ట్-అఫ్-ఫైవ్ సెట్స్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. బంతి కోర్ట్ బౌండరీలలో ల్యాండ్ అయినప్పుడు లేదా ఏదైనా జట్టు ఆటలో తప్పు చేసినప్పుడు, పాయింట్ ప్రత్యర్థి జట్టుకు లభిస్తుంది.వాలీబాల్ తొలిసారిగా టోక్యో 1964 ఒలింపిక్ క్రీడల్లో ప్రవేశించింది.
ఒలింపిక్ వాలీబాల్ మెడల్ బోర్డులో మాజీ సోవియట్ యూనియన్, బ్రెజిల్ మరియు యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానాలు దక్కించుకున్నాయి.
ఈ మూడు దేశాలే ఒక్కొక్కటి కనీసం పది పతకాలు గెలుచుకున్న జాతీయ ఒలింపిక్ కమిటీలు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

వాటర్ పోలో
2 పతకాలు
ఆటలు
- పురుషులు
- మహిళలు
వాటర్ పోలో అనే ఆటలో 7 ప్లేయర్స్ (ఒక గోల్ కీపర్) కలిగిన రెండు జట్లు ఒక పూల్ లో తలపడతాయి.ప్రతి జట్టు ప్రత్యర్థి జట్టు నెట్‌లో బంతిని వేయడానికి (గోల్ చేయడానికి) ప్రయత్నిస్తుంది.ఆటగాళ్లు ఆడేటప్పుడు పూల్ యొక్క అడుగు భాగాన్ని గాని వెలుపల భాగాన్ని గాని తాకకూడదు. వారు నీటిలో ఈత కొడుతూ లేదా నీటిలోనే తేలుతూ (ట్రెడ్డింగ్ చేస్తూ) గోల్ చేయాలి.
గోల్ కీపర్ తప్ప, ప్రతి ఆటగాడు ఒక్క చేత్తో మాత్రమే బంతిని పట్టుకుని ఆడాలి. మహిళల విభాగంలో 10 జట్లు, పురుషుల విభాగంలో 12 జట్లు పోటీపడతాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

వెయిట్ లిఫ్టింగ్
10 పతకాలు
ఆటలు
- పురుషుల 61kg
- పురుషుల 73kg
- పురుషుల 89kg
- పురుషుల 102kg
- పురుషుల +102kg
- మహిళల 49kg
- మహిళల 59kg
- మహిళల 71kg
- మహిళల 81kg
- మహిళల +81kg
వెయిట్ లిఫ్టింగ్ అనేది మానవ శక్తి మరియు ధైర్యం యొక్క లోతులను ప్రతిబింబించే క్రీడ. ఆధునిక ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు దశలు ఉంటాయి — స్నాచ్ మరియు క్లీన్ అండ్ జెర్క్. స్నాచ్‌లో, వెయిట్‌లిఫ్టర్ బార్‌బెల్‌ను నేల నుండి ఒకే చలనం (సింగిల్ మోషన్)లో తల పైకి ఎత్తుతాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో, వెయిట్‌లిఫ్టర్ మొదట బార్‌బెల్‌ను ఎత్తి తన ఛాతీ వద్దకు తీసుకువస్తాడు (క్లీన్). తర్వాత స్వల్ప విరామం తీసుకుని, చేతులు మరియు కాళ్లను చాచుతూ మోచేతులను సూటిగా ఉంచి బార్‌బెల్‌ను తలపైకి ఎత్తి (జెర్క్) బజ్జర్ శబ్దం వచ్చే వరకు పట్టుకుని ఉంచాలి. ప్రారంభంలో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో పురుషులకే పరిమితమై ఉండగా,
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తొలిసారిగా మహిళల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్ ప్రవేశపెట్టబడింది.
ఆ ఎడిషన్ భారతదేశానికి చారిత్రాత్మకంగా నిలిచింది, ఎందుకంటే కర్ణం మల్లీశ్వరి 69 కిలోల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకం గెలుచుకున్న మొదటి భారతీయ వెయిట్‌లిఫ్టర్ అయ్యింది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

రెజ్లింగ్
18 పతకాలు
ఆటలు
- పురుషుల గ్రీకో-రోమన్ 60kg
- పురుషుల గ్రీకో-రోమన్ 67kg
- పురుషుల గ్రీకో-రోమన్ 77kg
- పురుషుల గ్రీకో-రోమన్ 87kg
- పురుషుల గ్రీకో-రోమన్ 97kg
- పురుషుల గ్రీకో-రోమన్ 130kg
- మహిళల ఫ్రీస్టైల్ 50kg
- మహిళల ఫ్రీస్టైల్ 53kg
- మహిళల ఫ్రీస్టైల్ 57kg
- మహిళల ఫ్రీస్టైల్ 62kg
- మహిళల ఫ్రీస్టైల్ 68kg
- మహిళల ఫ్రీస్టైల్ 76kg
- పురుషుల ఫ్రీస్టైల్ 57kg
- పురుషుల ఫ్రీస్టైల్ 65kg
- పురుషుల ఫ్రీస్టైల్ 74kg
- పురుషుల ఫ్రీస్టైల్ 86kg
- పురుషుల ఫ్రీస్టైల్ 97kg
- పురుషుల ఫ్రీస్టైల్ 125kg
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌కి రెండు విభాగాలు ఉన్నాయి — గ్రీకో-రోమన్ రెజ్లింగ్ మరియు ఫ్రీస్టైల్ రెజ్లింగ్. ప్రతి విభాగానికి ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో, పోటీదారుడు తన ప్రత్యర్థి నడుము పైన ఉండే భాగంపై మాత్రమే దాడి చేయగలడు, అందుకు తన చేతులు మరియు పైభాగాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఫ్రీస్టైల్ రెజ్లింగ్ మరింత స్వేచ్ఛగా (ఓపెన్‌గా) ఆడే విధానం. దీనిలో పోటీదారులు తమ కాళ్లను కూడా ఉపయోగించి,ప్రత్యర్థిని నడుము పైన గానీ, క్రింద గానీ పట్టుకోవచ్చు.అథ్లెట్లు మొత్తం 18 ఈవెంట్లలో స్వర్ణం, రజతం మరియు కాంస్య పతకాల కోసం పోటీపడతారు.ఈ పోటీలు మూడు విభాగాలుగా ఉంటాయి — పురుషులు ఫ్రీస్టైల్ మరియు గ్రీకో-రోమన్ విభాగాల్లో తలపడుతారు, మహిళలు మాత్రం ఫ్రీస్టైల్ విభాగంలో ఒలింపిక్ కీర్తి కోసం పోటీ పడతారు.ప్రతి విభాగం ఆరు బరువు వర్గాలుగా విభజించబడుతుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

అథ్లెటిక్స్
48 పతకాలు
ఆటలు
- పురుషుల వ్యక్తిగత పోటీ
- మహిళల వ్యక్తిగత పోటీ
- పురుషుల జట్టు పోటీ
- మహిళల జట్టు పోటీ
అథ్లెటిక్స్ అనేది పరిగెత్తడం, దూకడం, విసరడం లేదా నడవడం వంటి అనేక ఈవెంట్‌లను కలిగి ఉన్న క్రీడ. దీనిని తరచుగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అని కూడా పిలుస్తారు.ఈ క్రీడలో 100 మీటర్ల మారథాన్ లేదా లాంగ్ జంప్ అనబడే సింగిల్ ఈవెంట్‌లు; డెకాథ్లాన్ మరియు హెప్టాథ్లాన్‌తో కూడిన కంబైన్డ్ ఈవెంట్‌లు లేదా 4x100మీ రిలేలు వంటి జట్టు-ఆధారిత ఈవెంట్‌లు ఉంటాయి. టోక్యో 2020లో, అథ్లెట్లు 26 ఈవెంట్‌లలో పోటీ పడ్డారు - పారిస్ 2024 ప్రోగ్రామ్‌లో అదే సంఖ్యలో పోటీ పడ్డారు. మొత్తం 48 పతక ఈవెంట్‌లు మూడు విభిన్న విభాగాలుగా నిర్వహించబడతాయి —ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్ రన్నింగ్ మరియు రేస్ వాకింగ్. ఈ పోటీలలో పురుషులు మరియు మహిళలకు సమాన సంఖ్యలో పతక ఈవెంట్‌లు ఉంటాయి.
నీరజ్ చోప్రా నేతృత్వంలోని 29 మంది సభ్యుల భారత అథ్లెటిక్స్ జట్టు పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పోటీ పడింది. నీరజ్ చోప్రా, పురుషుల జావెలిన్ త్రోలో రజతం సాధించి పారిస్ 2024లో అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ఏకైక పతకాన్ని అందించాడు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

బ్యాడ్మింటన్
5 పతకాలు
ఆటలు
- పురుషుల వ్యక్తిగత పోటీ
- మహిళల వ్యక్తిగత పోటీ
- పురుషుల డబుల్స్ పోటీ
- మహిళల డబుల్స్ పోటీ
- మిక్స్‌డ్ డబుల్స్ పోటీ
బ్యాడ్మింటన్ అనేది ఇద్దరు ఆటగాళ్ళు లేదా డబుల్స్ జట్లు కోర్టులో ఆడే రాకెట్-అండ్-షటిల్ గేమ్. బ్యాడ్మింటన్‌ను ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్ళు (సింగిల్స్) లేదా రెండు జతల (డబుల్స్) ద్వారా ఇండోర్ లో ఆడతారు. వారు నెట్‌తో విభజించబడిన కోర్టు యొక్క వ్యతిరేక భాగాలలో స్థానాలను తీసుకుంటారు. ప్రతీ ఆటగాడు షటిల్‌ని ప్రత్యర్థి కోర్ట్ లో కొడతాడు. ప్రత్యర్థి లక్ష్యం దానిని విజయవంతంగా ఆ ఆటగాడి కోర్ట్‌లో ల్యాండ్ చేయడం. ప్రతీ మ్యాచ్ బెస్ట్-అఫ్-త్రి గేమ్స్ గా ఆడబడుతుంది. ప్రతీ గేమ్ లో 21 పాయింట్స్ కొట్టిన ఆటగాడు విజేత అవుతాడు. ఒలింపిక్ కార్యక్రమంలో పురుషుల, మహిళల సింగిల్స్/డబుల్స్ ఈవెంట్‌లు మరియు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లు ఉన్నాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

బేస్బాల్ సాఫ్ట్బాల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల బేస్ బాల్
- మహిళల సాఫ్ట్‌బాల్
బేస్‌బాల్ మరియు సాఫ్ట్‌బాల్ అనేవి రెండు జట్ల మధ్య ఆడే, ఒకే రకానికి చెందిన బాల్ క్రీడలు. తొమ్మిది మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు ఒక బంతిని కొడుతూ, పరుగులు తీస్తూ అత్యధిక పరుగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. బ్యాట్స్ మాన్ పరుగు కోసం కొన్ని బేస్ లు దాటుకుంటూ హోమ్ ప్లేట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. జట్లు బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ మధ్య తిరుగుతాయి. ప్రతి సెషన్‌ను ఇన్నింగ్స్ అని పిలుస్తారు మరియు ఫీల్డింగ్ జట్టు ముగ్గురు ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేసినప్పుడు మారుతాయి. ఒక బేస్ బాల్ ఆట తొమ్మిది ఇన్నింగ్స్‌ల వరకు ఉంటుంది, అయితే సాఫ్ట్‌బాల్ ఏడు ఇన్నింగ్స్‌ల వరకు ఉంటుంది. 1992 ఒలంపిక్ గేమ్స్ బార్సిలోనాలో బేస్ బాల్ పురుషుల పతక ఈవెంట్‌గా ప్రదర్శించబడింది. అట్లాంటా 1996 ఒలింపిక్ గేమ్స్‌లో సాఫ్ట్‌బాల్ మహిళలకు మాత్రమే పతక క్రీడగా పరిచయం చేయబడింది. వాస్తవానికి ఒలింపిక్స్‌లో ప్రత్యేక క్రీడలుగా పరిగణించబడిన బేస్‌బాల్ సాఫ్ట్‌బాల్ ఒలింపిక్ క్రీడలు టోక్యో 2020లో రెండు విభిన్న ఈవెంట్‌లతో (పురుషుల బేస్ బాల్ మరియు మహిళల సాఫ్ట్‌బాల్) సంయుక్త క్రీడగా తిరిగి వచ్చింది, ఇక్కడ ఆతిథ్య జపాన్ రెండు బంగారు పతకాలను గెలుచుకుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

బాస్కెట్‌బాల్ & 3x3 బాస్కెట్‌బాల్
4 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
- 3X3 పురుషుల జట్టు
- 3X3 మహిళల జట్టు
బాస్కెట్‌బాల్ అనేది దీర్ఘచతురస్రాకార కోర్ట్‌లో ఆడే జట్టు క్రీడ. ఇందులో ఐదుగురు ఆటగాళ్లతో కూడిన రెండు ప్రత్యర్థి జట్లు, బంతిని ప్రత్యర్థి జట్టు హూప్ మరియు నెట్‌లోకి (దానిని బాస్కెట్ అని పిలుస్తారు) విసరడం ద్వారా స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాయి.బాస్కెట్‌బాల్‌ను ఇండోర్ కోర్ట్‌లో ఆడతారు, మరియు ఒక జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉంటారు.గేమ్‌ను గెలవాలంటే, ఒక జట్టు ఇతర జట్టుకంటే ఎక్కువ ఫీల్డ్ గోల్స్ సాధించాలి. ఫీల్డ్ గోల్ అంటే, ఆటగాడు ప్రత్యర్థి బాస్కెట్‌లో బంతిని విజయవంతంగా షూట్ చేసినప్పుడు లభించే పాయింట్.జట్లకు బంతిని షూట్ చేయడానికి పరిమిత సమయం (24 సెకన్లు) మాత్రమే ఉంటుంది. దీర్ఘచతురస్రాకార కోర్ట్‌లో మూడు పాయింట్ల రేఖను సూచించే ఆర్క్ లోపల నుంచి వేసిన షాట్లు రెండు పాయింట్ల విలువ కలిగినవి, ఆర్క్ వెలుపల నుంచి వేసిన షాట్లు మూడు పాయింట్ల విలువ కలిగినవి.పురుషుల మరియు మహిళల 3×3 ఒలింపిక్ టోర్నమెంట్‌లలో ఒక్కొక్కటికి నలుగురు ఆటగాళ్లతో కూడిన ఎనిమిది జట్లు పాల్గొంటాయి.అయితే ఒకేసారి ప్రతి జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే కోర్ట్‌లో ఉంటారు.3×3 బాస్కెట్‌బాల్‌ను ప్రామాణిక కోర్ట్ పరిమాణం సగం ఉన్న కోర్ట్‌లో ఆడతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

బీచ్ వాలీబాల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
ఒలంపిక్ బీచ్ వాలీబాల్ అనేది నెట్‌తో విభజించబడిన, ఇసుక కోర్ట్‌కు ఇరువైపులా ఇద్దరు ఆటగాళ్లు ఆడే క్రీడ. ఆట యొక్క లక్ష్యం - ఆటగాళ్లు బంతిని కేవలం చేతుల సహాయంతోనే ఆడాలి. వారు బంతిని నెట్ మీదుగా ప్రత్యర్థుల కోర్టులోకి కొడతారు, ప్రత్యర్థులు దానిని వెనక్కి కొట్టలేనంతవరకు ఆట కొనసాగుతుంది.. ఒక్కో ర్యాలీ ఒక్కో పాయింట్‌ను పొందుతుంది. బీచ్ వాలీబాల్ మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ త్రీ సెట్‌లుగా ఆడబడతాయి. మొదటి రెండు సెట్‌లు 21 పాయింట్లకు మరియు అవసరమైతే మూడవ సెట్ 15 పాయింట్లకు ఆడబడుతుంది. బీచ్ వాలీబాల్ అధికారికంగా అట్లాంటా 1996లో ఒలింపిక్ క్రీడలలో భాగమైంది. పురుషుల మరియు మహిళల విభాగాలు రెండూ ఉన్నాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

కనో స్లాలం
6 పతకాలు
ఆటలు
- కె-1 పురుషుల
- సి-1 పురుషుల
- కె-1 మహిళల
- సి-1 మహిళల
- ఎక్స్-1 క్రాస్ ఈవెంట్‌లు
కనో స్లాలమ్‌లో పోటీదారులు సుమారు 300 మీటర్ల పొడవు ఉన్న వైట్‌వాటర్ కోర్సులో నావిగేట్ చేస్తారు అథ్లెట్లు గరిష్టంగా 25 అప్‌స్ట్రీమ్ మరియు డౌన్‌స్ట్రీమ్ గేట్‌లను వీలైనంత త్వరగా దాటవలసి ఉంటుంది. అథ్లెట్లు వీటిని 90 మరియు 110 సెకండ్స్ పూర్తి చేసే విధంగా కోర్సులని రూపొందించబడ్డాయి. ఎక్స్ట్రీమ్ కయాక్ లేదా కయాక్ క్రాస్‌లో, నలుగురు పోటీదారులు నీటి మీద రెండుమీటర్లకుపైగా ఉన్న ప్రారంభ ర్యాంప్ నుంచి జారుతారు. అక్కడినుంచి రేస్ మొదలవుతుంది, మొదటి బోయ్ చేరుకునేంతవరకు ఈ రేస్ కొనసాగుతుంది. కనో ఈవెంట్‌లలో పోటీదారులు సింగిల్-బ్లేడెడ్ తెడ్డును ఉపయోగిస్తారు. పోటీదారులు పడవపైన మోకాలి పై కూర్చుంటారు. కయాక్ ఈవెంట్‌లలో పోటీదారులు డబుల్ బ్లేడెడ్ తెడ్డును ఉపయోగిస్తారు. ఇక్కడ ఆరు ఒలింపిక్ కనో/కయాక్ స్లాలమ్ ఈవెంట్‌లు ఉంటాయి. ఇవన్నీ సోలో పాడ్లర్‌లు పాల్గొనే ఈవెంట్‌లు. పురుషులు మరియు మహిళలు K-1 (కయాక్), C-1 (కనో) మరియు X-1 (కయాక్ క్రాస్) విభాగాల్లో పోటీ పడతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

కనో స్ప్రింట్
10 పతకాలు
ఆటలు
- సి-1 మహిళల 200మీ
- సి-2 500మీ - పురుషులు & మహిళలు
- కె -1 500m - పురుషులు & మహిళలు
- కె-2 500m - పురుషులు & మహిళలు
- కె-4 500m - పురుషులు & మహిళలు
- సి-1 పురుషుల 1000మీ
కనో స్ప్రింట్ అనేది ఒక నీటి క్రీడ. ఇందులో అథ్లెట్లు ప్రత్యేకంగా రూపొందించిన స్ప్రింట్ కనోలు లేదా స్ప్రింట్ కయాక్‌లు ఉపయోగించి ప్రశాంతమైన నీటిలో రేస్ చేస్తారు.కానో స్ప్రింట్ పోటీలు 200 మీటర్ల నుంచి 1000 మీటర్ల మధ్య దూరం ఉన్న ఫ్లాట్‌వాటర్ కోర్సులలో నిర్వహించబడతాయి. అథ్లెట్లు పడవల మీద మోకాళ్లపై కూర్చుని, బెల్ట్‌లతో బలంగా బిగించబడి ఉంటారు. వారు ఒకే బ్లేడ్ ఉన్న ప్యాడిల్‌ను ఉపయోగించి పడవను వేగంగా నడిపిస్తారు.ప్రతి స్ప్రింట్ కానో లేదా కయాక్ రేసులో ఎనిమిది మంది అథ్లెట్లు లేదా జట్లు పాల్గొంటారు. వారు తాము కేటాయించిన లేన్‌లలో మాత్రమే ప్రయాణించాలి. పారిస్ 2024లో, పురుషులకి ఐదు మరియు స్త్రీలకి ఐదు చొప్పున కానో స్ప్రింట్‌లో 10 రేసులు జరిగాయి అవి మహిళల సి-1 200మీ, పురుషుల సి-1 1000మీ, మహిళల సి-2 500మీ, పురుషుల సి-2 500మీ, మహిళలకె-1500మీ,పురుషుల కె-1 1000మీ, మహిళల కె-2 500మీ, పురుషుల కె-2 500మీ. -4 500మీ మరియు పురుషుల కే-4 500మీ.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సైక్లింగ్ బీఎంఎక్స్ ఫ్రీ స్టైల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల
- మహిళల
BMX ఫ్రీస్టైల్‌లో రైడర్లు చదునైన మైదానంలో, వీధుల్లో, డర్ట్ జంప్‌లపై, హాఫ్‌పైప్‌లలో ట్రిక్స్ ప్రదర్శిస్తూ, ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌లపై సీక్వెన్స్‌లతో కూడిన రోటీన్స్ ను ప్రదర్శిస్తారు.పోటీలో రైడర్లకు వారి ప్రదర్శనను బట్టి మార్కులు ఇవ్వబడతాయి.BMX ఫ్రీస్టైల్ అనేది వివిధ విభాగాలు కలిగి ఉంటుంది —అవి: పార్క్, వెర్ట్, ఫ్లాట్, స్ట్రీట్, మరియు డర్ట్. అయితే, ఒలింపిక్ క్రీడల్లో “పార్క్” పోటీలు మాత్రమే నిర్వహించబడతాయి.BMX పార్క్ పోటీలలో, అథ్లెట్లు స్పైన్‌లు, గోడలు, బాక్స్ జంప్‌లు వంటి వివిధ అడ్డంకులను ఎదుర్కొంటూ ట్రిక్స్ క్రమాన్ని అమలు చేస్తారు. ఇది BMX ఫ్రీస్టైల్ యొక్క ఒలింపిక్ విభాగం.
టోక్యో 2020లో మొత్తం 18 BMX ఫ్రీస్టైల్ సైక్లింగ్ పోటీదారులు పార్క్ విభాగంలో పాల్గొన్నారు.
పారిస్ 2024లో, సీడింగ్-ఇన్-ఫైనల్ ఫార్మాట్‌ను ఉపయోగించి పురుషుల మరియు మహిళల ఈవెంట్‌లు విడిగా నిర్వహించబడ్డాయి.సీడింగ్ దశలో, ఫైనల్‌లో ప్రారంభ క్రమం నిర్ణయించబడుతుంది. ప్రతి రైడర్‌కు ప్రతి రౌండ్‌లో రెండు పరుగులు (runs) చేసే అవకాశం ఉంటుంది, మరియు అత్యుత్తమ స్కోర్‌ను తుది స్కోర్‌గా పరిగణిస్తారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్
2 పతకాలు
ఆటలు
- పురుషుల
- మహిళల
బీఎంఎక్స్ (BMX) రేసింగ్‌లో ఎనిమిది మంది బీఎంఎక్స్ సైక్లిస్టులు ఒకే ల్యాప్ ట్రాక్‌పై పోటీపడతారు. ఆ ట్రాక్‌లో సూటి మార్గాలు, జంప్స్ మరియు మలుపులు ఉంటాయి. ఫినిష్ లైన్‌ను మొదట దాటిన రైడర్ రేసును గెలుస్తాడు.
బీఎంఎక్స్ రేసింగ్, సైక్లింగ్‌లో అత్యంత వేగవంతమైన మరియు యువతకు సంబంధించిన విభాగాలలో ఒకటి. దీని సూత్రం చాలా సరళం — ఎనిమిది మంది రైడర్లు జంపులు, గట్టి మలుపులు మరియు అడ్డంకులతో నిండిన ట్రాక్‌పై పోటీపడతారు. ఇది ఒలింపిక్ ప్రోగ్రామ్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఒకే భాగంగా ఉంది.ఈ క్రీడలో అగ్రస్థాయిలో విజయాలు సాధించిన రైడర్లు ఉన్నారు. వారిలో మూడుసార్లు ఒలింపిక్ పతక విజేతగా మరియు రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన మారియానా పాజోన్ ఒక ప్రముఖ రైడర్.అదేవిధంగా నీక్ కిమ్మాన్ (నెదర్లాండ్స్), సిల్వెన్ ఆండ్రే (ఫ్రాన్స్), బెథనీ ష్రీవర్ (గ్రేట్ బ్రిటన్) మరియు లారా స్ముల్డర్స్ (నెదర్లాండ్స్) వంటి వారు కూడా ఈ క్రీడలో ప్రసిద్ధి పొందారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సైక్లింగ్ మౌంటైన్ బైక్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
మౌంటైన్ బైక్ సైక్లింగ్‌లో, ప్రత్యేకంగా రూపొందించిన సైకిల్‌ను ఉపయోగించి పర్వత ప్రాంతాలు లేదా ఎత్తైన కొండప్రాంతాల్లో ఆఫ్-రోడ్ సైక్లింగ్ చేస్తారు.MTB అని కూడా పిలువబడే మౌంటైన్ బైక్ రేసింగ్ విభిన్న విభాగాలతో కూడిన విభిన్నమైన క్రీడ. ఈ విభాగాల్లో ప్రధానమైనవి — క్రాస్ కంట్రీ ఒలింపిక్ (XCO), షార్ట్ ట్రాక్ (XCC), ఎలిమినేటర్ (XCE), మరియు ఇ-మౌంటైన్ బైకింగ్.ఈ క్రీడలో పోటీ విధానం చాలా సులభంగా ఉంటుంది — ముగింపు రేఖను ముందుగా దాటిన రైడర్‌నే విజేతగా ప్రకటిస్తారు.అయితే, కొన్ని విభాగాల్లో ఒక రైడర్ ల్యాప్ చేయబడితే లేదా అగ్రస్థానంలో ఉన్న రైడర్ కంటే ఎక్కువగా వెనుకబడితే, అతనిని రేసు నుండి తప్పించవచ్చు
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సైక్లింగ్ రోడ్డు
4 పతకాలు
ఆటలు
- పురుషుల రోడ్ రేస్
- పురుషుల వ్యక్తిగత టైం ట్రయల్స్
- మహిళల రోడ్ రేస్
- మహిళల వ్యక్తిగత టైం ట్రయల్స్
సాధారణంగా రోడ్ సైక్లింగ్‌లు చదును చేయబడిన రోడ్లపై జరుగుతాయి. ఇవి రెండు రకాలుగా జరుగుతాయి — సామూహిక రేసులు మరియు టైమ్ ట్రయల్స్.ఒలింపిక్ కార్యక్రమంలో ఎప్పటి నుంచో చోటు దక్కించుకున్న కొన్ని అరుదైన క్రీడలలో సైక్లింగ్ ఒకటి.టైమ్ ట్రయల్ మరియు రోడ్ రేస్ వేర్వేరు ప్రత్యేకతలు కావడంతో, కేవలం కొంతమంది రైడర్‌లు మాత్రమే రెండు రకాల ఈవెంట్‌లలో పాల్గొనగలరు, ఎందుకంటే రెండింటికీ వేర్వేరు శిక్షణ కావాలి.ఒలింపిక్‌లో పోటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి, ఉత్తమ రైడర్లు ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఉంటారు — అది ఫ్లాట్, కొండ లేదా పర్వత భూభాగం కావొచ్చు.టైమ్ ట్రయల్స్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లు ముందుగా సూచించిన సమయ పరిమితిలో పూర్తి చేయాలి. రోడ్ రేస్‌లు సామూహిక ప్రారంభ ఈవెంట్‌లు — మొదటగా ముగింపు రేఖను దాటిన అథ్లెట్ విజేత అవుతాడు. మహిళలకు 120 కి.మీ మరియు పురుషులకు 200 కి.మీ రోడ్ రేస్‌లు జరుగుతాయి. స్ప్రింట్ ఫినిష్ అనేది రేస్ ముగింపు దశలో చివరి 100 మీటర్లలో జరుగుతుంది, ఇక్కడ అథ్లెట్లు తరచుగా విజయం సాధిస్తారు. టైమ్ ట్రయల్‌లో పోటీదారులు సమూహ పెలోటాన్‌లో కాకుండా, వేర్వేరు సమయాల్లో బయలుదేరుతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సైక్లింగ్ ట్రాక్
12 పతకాలు
ఆటలు
- టీమ్ పర్స్యూట్ - పురుషులు & మహిళలు
- ఓమ్నియం - పురుషులు & మహిళలు
- కెయిరిన్ - పురుషులు & మహిళలు
- మాడిసన్ - పురుషులు & మహిళలు
- స్ప్రింట్ - పురుషులు & మహిళలు
- టీమ్ స్ప్రింట్ - పురుషులు & మహిళలు
ట్రాక్ సైక్లింగ్ అనేది ఓవల్ ఆకారంలో ఉండే ట్రాక్‌పై సైకిల్ రేసులుగా జరుగుతుంది. ఈ ట్రాక్ సాధారణంగా చెక్కతో నిర్మించబడుతుంది మరియు ఎక్కువగా ఇండోర్‌లో (లోపలి ప్రాంగణంలో) ఉంటుంది, కానీ ఎప్పుడూ అలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రకమైన రేసులు “వెలోడ్రోమ్” అనే ప్రత్యేక ప్రాంగణంలో నిర్వహిస్తారు. ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్‌లు 1896 నుండి ప్రతి ఒలింపిక్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించబడ్డాయి. ఈ క్రీడలో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి — వీటిలో పురుషులు మరియు మహిళలకు వేర్వేరు రేసులు ఉంటాయి. అవి: టీమ్ పర్స్యూట్, ఓమ్నియం, కీరిన్, మాడిసన్, స్ప్రింట్, టీమ్ స్ప్రింట్.
టీమ్ పర్స్యూట్ (Team Pursuit):
ఈ ఈవెంట్‌లో నాలుగు సైక్లిస్టులతో కూడిన రెండు బృందాలు పాల్గొంటాయి. జట్లు ట్రాక్ యొక్క ఎదురెదురుగా ఉన్న వైపుల నుంచి ప్రారంభమై, 16 ల్యాప్‌లు (4,000 మీటర్లు) పూర్తి చేయాలి.
టీమ్ స్ప్రింట్ (Team Sprint):
పురుషుల టీమ్ స్ప్రింట్ ఒక అత్యంత వేగపూరిత (హై-ఆక్టేన్) ఈవెంట్ — ఇది పూర్తిగా వేగం మీద ఆధారపడుతుంది. పురుషుల రేసులో ముగ్గురు రైడర్లు మూడు ల్యాప్‌లు పూర్తి చేస్తారు, మహిళల రేసులో ఇద్దరు రైడర్లు రెండు ల్యాప్‌లు పూర్తి చేస్తారు.
ప్రతి రైడర్ తప్పనిసరిగా ఒక ల్యాప్‌కి ముందుండాలి; ఆ తర్వాత వెనుక ఉన్న రైడర్ అతని స్థానాన్ని స్వీకరిస్తాడు. చివరి రైడర్ ఫినిష్ లైన్ దాటిన సమయమే జట్టు యొక్క తుది టైమ్‌గా పరిగణించబడుతుంది.
ఓమ్నియం (Omnium):
ఓమ్నియం అనేది బహుళ రేసులతో కూడిన ఈవెంట్. ఇందులో నాలుగు రకాల రేసులు ఉంటాయి — స్క్రాచ్ రేస్, టెంపో రేస్, ఎలిమినేషన్ రేస్, పాయింట్స్ రేస్.
కైరిన్ అంటే 'రేసింగ్ సైకిల్' అని అర్థం. ఈ ఈవెంట్‌లో రైడర్‌లు మూడు ల్యాప్ లు పేస్ మోటార్‌సైకిల్‌ను అనుసరిస్తారు, మరో మూడు ల్యాప్‌లు పేస్ మోటార్‌సైకిల్ లేకుండా పూర్తి చేస్తారు.
మ్యాచ్ స్ప్రింట్ (Match Sprint):
ఈ పోటీ ఒక ఫ్లైయింగ్-స్టార్ట్ 200 మీటర్ల టైమ్ ట్రయల్‌తో ప్రారంభమవుతుంది, ఇది అత్యంత వేగపూరితమైనది. మ్యాచ్ స్ప్రింట్లు వ్యూహాత్మక యుద్ధాల్లా సాగుతాయి — రైడర్లు పక్కపక్కనే ప్రారంభించి, మూడు ల్యాప్‌ల ట్రాక్‌పై ఒకరిపై ఒకరు వ్యూహపూర్వకంగా పోటీపడతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

ఫెన్సింగ్
12 పతకాలు
ఆటలు
- వ్యక్తిగత ఎపీ (మహిళలు / పురుషులు)
- వ్యక్తిగత రేకు (మహిళలు / పురుషులు)
- వ్యక్తిగత సాబెర్ (మహిళలు / పురుషులు)
- టీమ్ ఎపీ (మహిళలు / పురుషులు)
- టీమ్ ఫాయిల్ (మహిళలు / పురుషులు)
- టీమ్ సాబెర్ (మహిళలు / పురుషులు)
ఫెన్సింగ్ అనేది ఒక పోరాట క్రీడ, ఇందులో ఇద్దరు అథ్లెట్లు తమ ప్రత్యర్థిని కొట్టే లక్ష్యంతో ఒకరిపై ఒకరు దాడి చేయడానికి మరియు రక్షించుకోవడానికి కత్తులను ఉపయోగిస్తారు. ఫెన్సింగ్ బౌట్‌లో ఇద్దరు ఫెన్సర్లు మరియు ఒక రిఫరీ ఉంటారు.పాయింట్లు సాధించడం కోసం అథ్లెట్లు తమ ప్రత్యర్థి శరీరంలోని నిర్దేశిత ప్రాంతాలపై తమ కత్తులతో హిట్‌లు లేదా ‘టచ్‌లు’ చేస్తారు.జట్టు పోటీలో, ఒక జట్టులోని ప్రతి సభ్యుడు మరో జట్టులోని ప్రతి సభ్యునితో ఒక్కసారి తలపడతారు.ఆధునిక ఫెన్సింగ్‌లో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి — ఫాయిల్, ఎపీ, సాబ్రే (దీనిని ‘సాబర్’ అని కూడా పిలుస్తారు). ప్రతి విభాగం ప్రత్యేకమైన బ్లేడ్ ను ఉపయోగిస్తుంది మరియు వాటికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

ఫ్లాగ్ ఫుట్‌బాల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
ఫ్లాగ్ ఫుట్‌బాల్ అనేది అమెరికన్ ఫుట్‌బాల్ (లేదా గ్రిడిరాన్) యొక్క ఇంకొక రూపం. ఇక్కడ, ప్రత్యర్థి టీం యొక్క అడ్డంకుల్ని దాటుకుంటూ వారి ఎండ్ జోన్ కి చేరుకోవడం ఆటగాళ్ల యొక్క లక్ష్యం. దీంట్లో ఆటగాళ్లు ప్రత్యర్ధి ఆటగాళ్లని టచ్ చేయరు. బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు నడుముకు జోడించబడిన మూడు ఫాబ్రిక్ 'ఫ్లాగ్‌లలో' ఒకదాన్ని తీసివేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. ఇలా చేయడాన్ని’టాకిల్’ అంటారు. ప్రతి జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు, వారిలో ఐదుగురు మైదానంలో ఆడతారు. ఆటగాళ్లు సాధారణంగా అఫెన్స్ (దాడి) లేదా డిఫెన్స్ (రక్షణ) లో నైపుణ్యం కలిగి ఉంటారు.
ఒక మ్యాచ్ రెండు 20 నిమిషాల భాగాలుగా ఆడబడుతుంది (మధ్యలో ఒక చిన్న విరామంతో). ఆట ముగిసేది — జెండా తీసివేయబడినప్పుడు, బాల్ క్యారియర్ హద్దులు దాటి వెళ్ళినప్పుడు లేదా ఫార్వర్డ్ పాస్ నేలను తాకినప్పుడు. అఫెన్స్ లో ఉన్న జట్టు తమ సొంత ఐదు-గజాల లైన్ నుండి గ్రౌండ్ సగం వరకు వెళ్ళడానికి నాలుగు ప్రయత్నాలు చెయ్యవచ్చు. వీటిని డౌన్స్ అని పిలుస్తారు. విజయవంతమైతే, వారు ఎండ్‌జోన్‌ను చేరుకోవడానికి మరియు టచ్‌డౌన్‌ను స్కోర్ చేయడానికి మరో నాలుగు డౌన్‌లను కలిగి ఉంటారు. ఫ్లాగ్ ఫుట్‌బాల్ లాస్ ఏంజిల్స్ 2028లో ఒలింపిక్ అరంగేట్రం చేసింది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

ఫుట్బాల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. 11 మంది ఆటగాళ్లతో కూడిన జట్లు పాదాలను ఉపయోగించి గోల్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. 11 మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు చేతులు మినహా వారి శరీరంలోని ఏ భాగాన్ని అయినా ఉపయోగించి బంతిని గోల్‌గా మలచడానికి ప్రయత్నిస్తాయి.
ఒక ఫుట్‌బాల్ గేమ్, లేదా మ్యాచ్, రెండు 45 నిమిషాల పాటు ఆడుతారు. మధ్యలో 15 నిమిషాల విరామం ఉంటుంది. ప్యారిస్‌లో జరిగిన పురుషుల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. మహిళల టోర్నమెంట్‌లో 12 జట్లు నాలుగు గ్రూపులుగా ఉంటాయి. గ్రూప్ మ్యాచ్‌లు 90 నిమిషాల తర్వాత డ్రాగా ముగియవచ్చు. అయితే నాకౌట్ గేమ్ లో అదనపు సమయాన్ని కేటాయిస్తారు. అప్పుడు కూడా టై అయితే పెనాల్టీ షూట్-అవుట్‌కు వెళ్తారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

గోల్ఫ్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
గోల్ఫ్ అనేది ఒక బాల్‌ను క్లబ్‌తో టీ నుండి రంధ్రంలోకి వీలైనంత తక్కువ స్ట్రోక్స్‌లో కొట్టాలనే ఆలోచనతో కూడిన క్రీడ. అవి టీ షాట్‌తో ప్రారంభించి, గ్రీన్ అని పిలువబడే కత్తిరించిన ఉపరితలంపై ఉన్న రంధ్రంలో ముగుస్తాయి. ఇక్కడ పుటర్ మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. చాల వరకు ప్రొఫెషనల్ టౌర్నమెంట్స్ లో నాలుగు రౌండ్‌లు ఉంటాయి. ప్రతి రౌండ్ లో 18 హోల్స్ ఉంటాయి. ప్రతి హోల్ కి పార్ స్కోర్ ఉంటుంది. అది ఆ హోల్ ని పూర్తి చేయడానికి అధిక-నాణ్యత గల గోల్ఫ్ క్రీడాకారుడు తీసుకోవాల్సిన షాట్‌ల సంఖ్య. ఒలింపిక్స్‌లో పురుషుల మరియు మహిళల ప్రతి టోర్నమెంట్‌లో ఒక్కో దేశానికి గరిష్టంగా నలుగురు క్రీడాకారులు పాల్గొనవచ్చు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

హ్యాండ్‌బాల్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
హ్యాండ్‌బాల్ అనేది ఒక వేగవంతమైన ఇండోర్ గేమ్, ఇక్కడ ప్రత్యర్థి జట్లు ఒక బంతిని, పోస్ట్‌లు మరియు క్రాస్‌బార్‌తో ఉన్న ఫుట్‌బాల్ తరహా గోల్‌లోకి విసిరి స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాయి.ఆధునిక హ్యాండ్‌బాల్ గేమ్ 40m x 20m వైశాల్యం కలిగిన ఇండోర్ కోర్ట్‌లో, ఏడుగురు ఆటగాళ్లు కలిగిన రెండు జట్ల మధ్య ఆడతారు.ఒక హ్యాండ్‌బాల్ మ్యాచ్ 60 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. ఇందులో 30 నిమిషాల వ్యవధితో రెండు అర్ధభాగాలు ఉంటాయి. ప్రతీ జట్టు యొక్క లక్ష్యం అత్యధిక గోల్స్ ని చేసి అత్యధిక స్కోర్ ని సాధించడం. డిఫెండింగ్ గోల్‌టెండర్‌ను దాటడానికి మరియు డ్రిబుల్ చేయడానికి చేతులను మాత్రమే ఉపయోగించాలి.
పారిస్ 2024 హ్యాండ్‌బాల్ పోటీలో 12 పురుషుల మరియు 12 మహిళల జట్లు స్వర్ణం కోసం పోరాడాయి. ప్రతీ జట్టు 14 మంది ఆటగాళ్లు కలిగి ఉంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

హాకీ (ఫీల్డ్)
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
ఫీల్డ్ హాకీ పోటీ ఒలింపిక్ సమ్మర్ గేమ్స్‌లో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక కృత్రిమ గడ్డి పిచ్‌పై నిర్వహించబడుతుంది. ఇక్కడ 11 ఆటగాళ్లు (10 మంది ఇన్‌ఫీల్డ్ ప్లేయర్లు మరియు ఒక గోల్‌కీపర్) కలిగిన రెండు జట్లు పోటీపడతాయి. ప్రత్యర్థి జట్టు నెట్‌లో అత్యధిక గోల్స్‌ని స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాయి.
ఆటగాళ్ళు బంతిని కొట్టడానికి, చివర్లో వంపు తిరిగి ఉన్న ఒక కర్రను ఉపయోగిస్తారు.హాకీ మ్యాచ్ 60 నిమిషాలు ఉంటుంది, — ఇది 15 నిమిషాల నాలుగు పీరియడ్‌లను కలిగి ఉంటుంది. మొత్తం 24 జట్లు (పురుషులు మరియు మహిళలకు 12 చొప్పున) తమ సంబంధిత టోర్నమెంట్‌లలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

మారథాన్ స్విమ్మింగ్
2 పతకాలు
ఆటలు
- పురుషుల వ్యక్తిగత
- మహిళల వ్యక్తిగత
మారథాన్ స్విమ్మింగ్‌లో అథ్లెట్లు సముద్రం, నదులు మరియు సరస్సుల వంటి బహిరంగ నీటి పరిసరాలలో 10 కి.మీ కోర్సులో పాల్గొంటారు — అంటే ఇది శారీరక దారుఢ్యానికి మాత్రమే పరీక్ష కాదు, మానసిక బలం మరియు వ్యూహాత్మక సామర్థ్యానికి కూడా పరీక్ష.
బహిరంగ వాతావరణం కావున, అథ్లెట్లు మారుతున్న ప్రవాహాలకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి. అంతేకాక, పోటీదారుల మధ్య శారీరక సంబంధం (కాంటాక్ట్) మరియు వాటర్ స్టాప్‌లు సాధారణంగా జరుగుతాయి.
ఒలింపిక్ మారథాన్ స్విమ్మింగ్ కోసం నీటి ఉష్ణోగ్రత కనిష్టంగా 16°C (60.8°F) మరియు గరిష్టంగా 31°C (87.8°F) మధ్య ఉండాలి. ఏ సమయంలోనైనా నీటి కనిష్ట లోతు 1.40 మీటర్లు ఉండాలి.
రెండు ఈవెంట్లలో (ఒక పురుషుల రేసు మరియు ఒక మహిళల రేసు) మొత్తం 22 మంది పురుష అథ్లెట్లు మరియు 22 మంది మహిళా అథ్లెట్లు పోటీ పడుతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

మోడరన్ పెంటాథ్లాన్
2 పతకాలు
ఆటలు
- పురుషుల వ్యక్తిగత పోటీ
- మహిళల వ్యక్తిగత పోటీ
మోడర్న్ పెంటాథ్లాన్ ఐదు విభిన్న విభాగాలను కలిగి ఉంటుంది — ఈత, ఫెన్సింగ్, గుర్రపు స్వారీ (షో జంపింగ్), పిస్టల్ షూటింగ్ మరియు రన్నింగ్.
పోటీ యొక్క మొదటి రోజున ఫెన్సింగ్ ర్యాంకింగ్ రౌండ్ ఉంటుంది, ఇక్కడ 36 మంది పోటీ పడుతారు. 70% విజయాల మొత్తం స్కోరు (35 బౌట్‌లలో 25) 250 మోడర్న్ పెంటాథ్లాన్ (MP) పాయింట్‌లకు సమానం. 25 బౌట్‌లకు మించి ఉన్న ప్రతి విజయం 5 పాయింట్లను జోడిస్తుంది, అయితే ప్రతి ఓటమికి 5 MP పాయింట్లు తగ్గిస్తారు.అథ్లెట్లందరూ సెమీ ఫైనల్‌లోకి తమ పాయింట్లను తీసుకువెళతారు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లా (రైడింగ్, ఫెన్సింగ్ బోనస్ రౌండ్, స్విమ్మింగ్, లేజర్ రన్) అదే క్రమంలో నిర్వహించబడతాయి. టాప్ 18 మహిళా మరియు పురుష అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.తదుపరి షో జంపింగ్ రౌండ్ షెడ్యూల్ చేయబడుతుంది. ఎవరైతే పరిమిత సమయంలో రౌండ్‌ను పూర్తి చేస్తారో వారికి 300 పాయింట్లు వస్తాయి. నాక్‌డౌన్‌లు లేదా తిరస్కరణలు ఉంటే పాయింట్లు తగ్గించబడతాయి మరియు అవి ఎలిమినేషన్‌కు దారి తీస్తాయి. రైడింగ్ నుండి తొలగించబడిన ఏ అథ్లెట్ అయినా సున్నా పాయింట్లు పొందుతాడు.తదుపరి రౌండ్ ఫెన్సింగ్ బోనస్ — ఇక్కడ ప్రతి విజయానికి అథ్లెట్ రెండు పాయింట్లు సంపాదిస్తాడు. ర్యాంకింగ్ రౌండ్‌లో టాప్ ఫెన్సర్ ఎలిమినేషన్ ఫార్మాట్‌లో చివరి స్థానంలో ఉంటాడు, అంటే వారికి ఒక బౌట్ మాత్రమే ఉంటుంది, మరియు ఆ బౌట్‌లో గెలిస్తే నాలుగు పాయింట్లు వస్తాయి.తర్వాత రౌండ్ స్విమ్మింగ్ — 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈత. ఉత్తమ ఈతకు అత్యధిక స్కోరు లభిస్తుంది; 2 నిమిషాలు 30 సెకన్లు 250 MP పాయింట్‌లకు సమానం. ఈ సమయానికి పైన ఉన్న ప్రతి సెకనుకి 2 MP పాయింట్లు తగ్గిపోతాయి, అలాగే పరిమిత సమయానికి ముందు మిగిలిన ప్రతి సెకనుకి 2 MP పాయింట్లు లభిస్తాయి.
లేజర్ రన్ చివరి రౌండ్. ఇక్కడ ఆటగాళ్లు పాయింట్ల ఆధారంగా క్రమ పద్ధతిలో ప్రారంభిస్తారు — లీడర్ ముందుగా ప్రారంభిస్తాడు, మరియు లైన్ దాటిన మొదటి అథ్లెట్ విజేత అవుతాడు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

రిథమిక్ జిమ్నాస్టిక్స్
2 పతకాలు
ఆటలు
- మహిళల వ్యక్తిగత అల్-అరౌండ్ పోటీ
- మహిళల గ్రూపు అల్-అరౌండ్ పోటీ
ఒలింపిక్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ అనేది మహిళలకు మాత్రమే సంబంధించిన పోటీ. ఆటగాళ్లు తమ వాయిద్యాన్ని ఉపయోగించి తమ నైపుణ్యం, వశ్యత మరియు సంగీతాన్ని ప్రదర్శిస్తారు.పారిస్ 2024లో, మొత్తం 94 మంది రిథమిక్ జిమ్నాస్ట్‌లు పోటీ పడ్డారు — వీరిలో 24 మంది వ్యక్తిగత అథ్లెట్లు మరియు 14 గ్రూపులు (ప్రతి గ్రూపులో ఐదుగురు అథ్లెట్లు).రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో న్యాయమూర్తులు జిమ్నాస్ట్ ప్రదర్శనను అంచనా వేసి, డిఫికల్టీ (D) స్కోర్ మరియు ఎగ్జిక్యూషన్ (E) స్కోర్ అందజేస్తారు.ఈ రెండూ కలిపి తుది స్కోర్ ఇవ్వబడుతుంది.ఒకవేళ వాయిద్యానికి ఏదైనా నష్టం జరిగితే, ఎక్కువ సమయం తీసుకుంటే లేదా ఆటగాడు పాదాలపై భారంగా ల్యాండ్ అయితే, జరిమానా విధించబడుతుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

రోయింగ్
12 పతకాలు
ఆటలు
- సింగిల్ స్కల్స్ - పురుషులు & మహిళలు
- డబుల్ స్కల్స్ - పురుషులు & మహిళలు
- క్వాడ్రపుల్ స్కల్స్ - పురుషులు & మహిళలు
- కాక్స్‌లెస్ జంట - పురుషులు & మహిళలు
- కాక్స్‌లెస్ ఫోర్ - పురుషులు & మహిళలు
- ఎనిమిది - పురుషులు & మహిళలు
- తేలికైన డబుల్ స్కల్స్ - పురుషులు & మహిళలు
రోయింగ్ అంటే పడవకు అమర్చిన తెడ్డులను (oars) ఉపయోగించి పడవను ముందుకు నడపడం. ఒలింపిక్స్‌లో, రోవర్లు (జట్లుగా లేదా సింగిల్‌గా) వ్యతిరేక దిశలో రేసు చేస్తారు.
రోవర్లు ఒక్కరుగా లేదా ఇద్దరు, నలుగురు, లేదా ఎనిమిది మంది జట్టుగా పోటీ పడతారు. రోవర్లు 2,000 మీటర్ల దూరం వరకు రేస్ చేస్తారు.డబుల్ స్కల్స్ అథ్లెట్లు ప్రతి చేతిలో ఒక తెడ్డును పట్టుకుంటారు,
అయితే స్వీప్ రోయింగ్ అథ్లెట్లు రెండు చేతులతో ఒకే తెడ్డును పట్టుకుంటారు.జట్టు కి ఎనిమిది మంది ఉంటే, ఆ జట్టులో ఒక కాక్స్‌వైన్ (coxswain) ఉంటాడు. అతను జట్టుకు మార్గం చూపుతాడు. పడవకు ఒక చిన్న చుక్కాని (rudder) అమర్చబడి ఉంటుంది. దీన్ని ఒక రోవర్ కేబుల్ సహాయంతో తన కాలికి కట్టుకుంటాడు. ఈ రోవర్ ఆ చుక్కానిని ఉపయోగించి పడవను సరైన మార్గంలో నడిపిస్తాడు.లేన్‌లు ప్రతి 10 నుండి 12.5 మీటర్ల దూరంలో బోయ్‌లతో స్పష్టంగా గుర్తించబడతాయి, మరియు కోర్సు కనీసం మూడు మీటర్ల లోతు కలిగి ఉంటుంది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

రగ్బీ సెవెన్స్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
రగ్బీ సెవెన్స్ అనేది రగ్బీ యూనియన్ యొక్క సెవెన్-ఎ-సైడ్ ఫార్మాట్, ఇందులో 15-ఎ-సైడ్ ఫార్మాట్ కూడా ఉంటుంది. రగ్బీ సెవెన్స్, 15ల మాదిరిగానే పూర్తి పిచ్‌లో ఆడబడుతుంది.అయితే, జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు — ముగ్గురు ఫార్వర్డ్‌లు మరియు నలుగురు బ్యాక్‌లు. బంతిని తన్నడానికి మాత్రమే అనుమతి ఉంటుంది, చేతితో ముందుకు తీసుకెళ్లడం నిషేధం.మ్యాచ్ చివర్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టు గెలుస్తుంది.
స్కోర్లు ఇలా ఇవ్వబడతాయి:
- ట్రై చేస్తే 5 పాయింట్లు,
- కన్వర్షన్ కిక్‌కు 2 పాయింట్లు,
- పెనాల్టీ కిక్‌కు 3 పాయింట్లు,
- డ్రాప్ గోల్‌కు 3 పాయింట్లు ఇవ్వబడతాయి.
రగ్బీ సెవెన్స్ మ్యాచ్ 14 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది — దీన్ని ఏడు నిమిషాల రెండు భాగాలుగా ఆడుతారు.12 మంది ఆటగాళ్లతో కూడిన పన్నెండు జట్లు మహిళల మరియు పురుషుల టోర్నమెంట్‌లకు అర్హత సాధిస్తాయి. ఇవి నాలుగు జట్లు ఉన్న మూడు పూల్స్‌గా విభజించబడతాయి.ప్రతి పూల్ నుండి ఉత్తమ జట్టు మరియు రన్నర్-అప్ జట్టు నాకౌట్ దశలకు చేరుకుంటాయి.ప్రతీ జట్టు క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్ మరియు చివరగా ఫైనల్‌లో స్థానం కోసం పోటీ పడవలసి వస్తుంది, అందువల్ల ఈ ఫార్మాట్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమైనది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

సెయిలింగ్
10 పతకాలు
ఆటలు
- మహిళల: విండ్‌సర్ఫింగ్, గాలిపటం, డింగీ, స్కిఫ్.
- పురుషుల: విండ్‌సర్ఫింగ్, గాలిపటం, డింగీ, స్కిఫ్.
- మిశ్రమంగా: డింగీ, మల్టీహల్.
సెయిలింగ్ అనేది అలలు మరియు గాలిని ఉపయోగించి పడవ లేదా ఓడను కదిలించే కళ.వరల్డ్ సెయిలింగ్ నిర్దేశించిన నియమాల ప్రకారం ఈ రేసింగ్ క్రీడ నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఒలింపిక్ రేసింగ్‌లో, సమాన బరువు మరియు కొలతలున్న పడవలను ఒక-డిజైన్ తరగతులుగా వర్గీకరించి రేసులు నిర్వహిస్తున్నారు.“పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 10 సెయిలింగ్ ఈవెంట్‌లు ఉంటాయి — వాటిలో రెండు మిశ్రమ పడవలు (470 మరియు నాక్రా 17), అలాగే పురుషులు మరియు మహిళల కోసం నాలుగు క్రాఫ్ట్‌లు చొప్పున ఉంటాయి. ఈ సెయిలింగ్ ఈవెంట్‌లలో విండ్‌సర్ఫింగ్, కైట్, డింగీ, స్కిఫ్ మరియు మల్టీహల్ ఉన్నాయి.”
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

క్రికెట్
2 పతకాలు
ఆటలు
- పురుషుల జట్టు
- మహిళల జట్టు
క్రికెట్ అనేది బ్యాట్-అండ్-బాల్ టీమ్ స్పోర్ట్. ఇక్కడ బ్యాటింగ్ జట్టు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంది, అయితే బౌలింగ్ జట్టు బ్యాట్స్‌మన్‌లను అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిని వికెట్లు తీయడం మరియు పరుగులను పరిమితం చేయడం అని కూడా పిలుస్తారు. క్రికెట్ బ్యాట్‌లు హై-గ్రేడ్ విల్లో నుండి తయారు చేస్తారు. బంతులని ఒక కార్క్ కోర్‌పై చుట్టూ లెదర్ తో కుట్టి తయారు చేస్తారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో, క్రికెట్‌ను టీ20 (20 ఓవర్ల) ఫార్మాట్‌లో నిర్వహించవలెనని సూచించబడింది.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?

బాక్సింగ్
2 పతకాలు
ఆటలు
- పురుషుల ఫెదర్‌వెయిట్ LE 55kg
- పురుషుల లైట్‌వెయిట్ LE 60kg
- పురుషుల లైట్ వెల్టర్‌వెయిట్ LE 65kg
- పురుషుల వెల్టర్‌వెయిట్ LE 70kg
- పురుషుల లైట్ హెవీవెయిట్ LE 80kg
- పురుషుల క్రూజర్‌వెయిట్ LE 90kg
- పురుషుల హెవీవెయిట్ > 90kg
- మహిళల ఫ్లైవెయిట్ LE 51kg
- మహిళల బాంటమ్‌వెయిట్ LE 54kg
- మహిళల ఫెదర్‌వెయిట్ LE 57kg
- మహిళల లైట్‌వెయిట్ LE 60kg
- మహిళల లైట్ వెల్టర్‌వెయిట్ LE 65kg
- మహిళల వెల్టర్‌వెయిట్ LE 70kg
- మహిళల హెవీవెయిట్ > 75kg
బాక్సింగ్ అనేది దాడి, శక్తి, మరియు వ్యూహంతో కూడిన యుద్ధ క్రీడ. ఇద్దరు పోటీదారులు ఒకరిని-ఒకరు నిర్దిష్టంగా అనుమతించిన ప్రాంతాల్లో — నడుము పైభాగం మరియు తలకు మాత్రమే పంచ్‌లు ఉపయోగించి పాయింట్లు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఒక మ్యాచ్‌ను పాయింట్లు ఎక్కువగా సాధించడం ద్వారా గానీ, లేదా ప్రత్యర్థిని నాకౌట్ చేయడం ద్వారా గానీ గెలవచ్చు. బౌట్లు సాధారణంగా 3 నుండి 12 రౌండ్లు ఉంటాయి, ప్రతి రౌండ్ సుమారు మూడు నిమిషాలు కొనసాగుతుంది. ఇది అమేచ్యూర్ మరియు ప్రొఫెషనల్ స్థాయిల్లో ఆడబడే క్రీడ.
ఆధునిక బాక్సింగ్ 1904 సమ్మర్ ఒలింపిక్స్‌లో మొదటగా భాగమైంది, మరియు 1912 స్టాక్‌హోమ్ గేమ్స్‌లో తప్ప అన్ని ఇతర ఒలింపిక్స్‌లో నిరంతరం కొనసాగుతోంది.
LA 2028 ఒలింపిక్ గేమ్స్‌లో బాక్సింగ్ మొత్తం 14 స్వర్ణ పతక విభాగాలతో (7 పురుషుల, 7 మహిళల వెయిట్ క్లాసెస్) నిర్వహించబడుతుంది. పురుషులు మరియు మహిళలు ఒక్కో 7 వెయిట్ క్లాసెస్‌తో సమానంగా విభజించబడతారు.
అథ్లెట్ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉందా లేదా మీ స్వంత క్రీడా వృత్తిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం కావాలా?
